""తెలుగు దేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామా రావు గారి పెద్దల్లుడు , సినీ నిర్మాత , మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు , ""కీర్తిశేషులు "" నాటికతో రంగస్థల ప్రవేశం చేసిన ( ఈ నాటకంలో నేను కూడా రెండు సార్లు వేషం వేసా ) ప్రముఖ సినీ నటుడు , నిర్మాత తో నేను ;;
రావు గోపాల రావు గారు రాజ్య సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఢిల్లీ లో పార్లమెంట్ ఆయనకు కేటాయించిన గృహంలో నేను 6 ఏళ్ళు ఉన్నా ;; 1989 సంవత్సరంలో ""నాకు రాజ్య సభ వద్దు ;; ఆ పదవికి నేను న్యాయం చేయలేకపోతున్నా ;; నేను రాజేనామా చేస్తా ;; ఆ పదవిని మంచి రాజకీయ , సామాజిక పరిజ్ఞానం ఉన్న తమ్ముడు తిప్పరాజు రమేష్ బాబు కే ఇవ్వండి "" అని నందమూరి తారక రామారావు గారికి రావు గోపాల రావు గారు ;విన్నావించారు..దీంతో....
1989 లో నాకు నందమూరి తారక రామా రావు గారు గుట్టు చప్పడు కాకుండా... B Form తో పాటు 25 వేల నగదు ఇచ్చి నామినేషన్ వెయ్యి తమ్ముడు అన్నారు ;; సీటును తమ అనునాయులకు ఇప్పించుకోవాలను కున్న కొందరు తెదేపా నాయకులు రెండు పత్రికలకు లీక్ చెయ్యడంతో కొన్ని గందరగోళ పరిస్టితులు, కుల, ప్రాంతీయ సమీకరణాల కారణంగా , అన్నిటికంటే ముఖ్యంగా నందమూరి గారు కాంగ్రెస్ నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ కోర్టుల్లో వేసిన కేసుల్లో 107 అభియోగాలు నమోదు అయ్యి , ఆయన ఆందోళనలో ఉన్నరోజుల్లో ""ప్రముఖ సామాజిక వర్గం "' ఆయనపై ""తీవ్ర ఒత్తిడి ""తీసుకువచ్చినట్లు నాకు సమాచారం అందడంతో బషీర్ బాగ్ MLA క్వార్టర్స్ లో రూమ్ నంబర్ 91 లో ఉన్న నేను తెల్లవారు ఝామున 3 గంటలకు ఆబిడ్స్ గృహానికి వెళ్లి , B.Form ని ముక్కలు ముక్కలుగా చించేసి అన్నగారి పాదాలమీద వేసా ;; ఆయన ఇచ్చిన 25 వేలు నగదు తిరిగి ఇచ్చేసా ;; అంతే
""ఆయన కన్నీళ్లు నా నెత్తిమీద పడ్డాయి ""
""ఆ రోజు నేను జీవితంలో మర్చిపోలేను ""
చాలా విషయాలు ఉన్నాయి ;; అప్పుడోసారి అప్పుడోసారి రాస్తా ;..మీ తిప్పరాజు రమేష్ బాబు..సీనియర్ పాత్రీకేయులు..ఇండో - శ్రీలంక జర్నలిస్ట్ ఫోరం , మాజీ సేక్రేటరీ..హైదరాబాద్.
No comments:
Post a Comment