Tuesday, 18 August 2020

కలెక్టరే ఆమెకు వందనం చేశాడు.. మానవాత్వానికి, మహిళా ఎస్.ఐ.కు దక్కిన గౌరవం..


కరోనా మృతునిపట్ల మనవత్వం చూపించిన మహిళా ఎస్.ఐ.కి గౌరవ వందనం చేశారు తిరువణ్ణామలై కలెక్టర్. తమిళనాడు రాష్ట్రం, తిరువన్నమలైలో  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది.
తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్  కందస్వామి
 కోవిడ్తో మరణించిన వ్యక్తి బంధువులు.. ఇతరులు భయంతో  దగ్గరకు రావడానికి నిరాకరించడంతో మహిళ ఎస్.ఐ.అల్లిరాణి స్వయంగా శవాన్ని మోసి ఖననానికి తరలించారు. దీంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 15 వేడుకలో ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ కందస్వామి ఆమెకు ప్రశంస పత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ ఆమెను వేదికపై తన స్థానంలో నిలబడాల్సిందిగా కోరారు. కిందకు దిగి ఆమె మానవత్వానికి దాదాపు 20 సెకన్లు  గౌరవసూచకంగా వందనం చేయడంతో అక్కడి వారితోపాటు,  ఆమె కూడా ఆశ్చర్యానందానికి లొనయారు. కాగా కలేక్టర్ కందస్వామి ప్రజల సమస్యల పట్ల సత్వరమే స్పందించే అధికారిగా పేర్కోంటున్నారు.

No comments:

Post a Comment