Wednesday, 26 August 2020
కరోనా వేళా కొత్త దందా... సర్టిఫికెట్లు ఇస్తాం... డోనేషన్ ఇవ్వండి....
కరోనాను పలువురు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు.. మీ సేవలకు మెచ్ఛి సర్టిఫికెట్ లు ఇస్తామంటూ ముందుకు వస్తున్నారు..అయితే ఈ సర్టిఫికెట్ల కోసం పలువురు ఏగబడుతున్నారు..ఢిల్లీ.. మధ్యాప్రదేశ్., గుజరాత్.. లలో కొన్ని స్వఛ్ఛంద సంస్థల పేరిట అందమైన డిటిపి డిజైన్ చేసి కోవిడ్ - వారియర్ పేరిట అడిగినన్ని సర్టిఫికెట్ లు వాట్స్ఆప్లలో పోష్టు చేస్తున్నారు.. ఆ సర్టిఫికెట్ ల పై అందమైన అమ్మాయిలను ఛైర్మన్ లుగా చూపుతుండటంతో యువత వీటికోసం ఎగబడుతోంది..ఇదంత ఉచితంగా అనుకుంటే కోవిడ్లో కాలేసినట్టే.. ఇదో అద్భుతమైన.. వ్యాపారం.. మా సంస్థ కు డోనేషన్ ఇవ్వండి మీకో పంచరంగుల కోవిడ్ వారియర్ సర్టిఫికేట్ పంపుతాం అంటూ స్వచ్చంద సంస్థ నిర్వాహకులు మెస్సేజ్ చేశారు.. అలా లక్షల రూపాయలు దండుకుంటున్నాట్లు అనిపించింది...నేను జర్నలిస్ట్ నని పేర్కంటూ మీ సంస్థ మానసిక బాలురకు చేసిన సేవలు ఏంటో వివరాలు పంపమని గుజరాత్లలోని ఓ సంస్థ పేరిట వున్న వాట్స్ఆప్లలో మెస్సేజ్ చేశాను..ఆవతల నుండి వ్యక్తి డోనేషన్ ఇచ్ఛిన వారికి సర్టిఫికెట్లు ఇస్తామని మీకు చూపేందుకు మా వద్ద వీడియోలు..ఫోటోలు లాంటివి ఎవీ లేవని పేర్కొన్నారు..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment