తమ తండ్రి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తున్న పోష్టులపై కుమారుడు "అభిజిత్ ముఖర్జీ"..కుమార్తె "షర్మిష్టముఖర్జీ" లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆర్మీ డాక్టర్లు ప్రణబ్ ముఖర్జీ వెంటిలేటర్ పై శ్వాస తీసుకుంటున్నారని స్పష్టం గా చెప్పారని,
ప్రణబ్ ప్రస్తుతం హీమోడౌనమికల్‌గా స్థిరంగా ఉన్నారని, తన తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు. మాజీ పార్లమెంటేరియన్ అయిన ప్రణబ్ కుమారుడు అభిజిత్ ట్వీట్ చేయగా..
కాంగ్రెస్ స్పోక్సు పర్సన్, మహిళా కాంగ్రెస్ ఢిల్లీ అధ్యక్షురాలు.. కధక్ నృత్య కళాకారిణి.అయిన ప్రణబ్ కుమార్తె "షర్మిష్టముఖర్జీ" దయచేసి మీడియా మిత్రులు నాకు ఫోను చేయకండి ఇప్పుడు నేను నా తండ్రి ఆరోగ్యం వివరాలు తెలుసుకునేంందుకు వైధ్యులు తెలిపే సమాచారం కోసం మాత్రమే ఫోను వాడుతున్నా అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
వారు ట్విట్టర్ వేదికగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆయన చికిత్స పొందుతున్న ఆర్మీ ఆస్పత్రి వర్గాలు ఇప్పటికే హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి.
రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు..
ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని ప్రకటించారు.
మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఈనెల 10న ప్రణబ్‌కు శస్త్రచికిత్స కూడా జరిగినట్టు వైద్యులు తెలిపారు.
కాగా, ప్రణబ్ ముఖర్జీ అస్వస్థతకు గురుకావడంతో ఈ నెల 10న ఉదయం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో చేర్పించారు.
అయితే.. అక్కడ పరీక్షల అనంతరం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా
గత వారం రోజులుగా తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా, హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ప్రణబ్ ముఖర్జీ సూచించిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment