Monday, 3 August 2020

హరీష్ రావు ఇంట వనజీవి మొక్కల ముచ్ఛట...స్వయంగా అల్పాహారాన్ని వడ్డించిన మంత్రి.


- ఆగస్టు -1/ఆదివారం : వనజీవి పద్మశ్రీ  రామయ్య దంపతులు సిద్దిపేట సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు తన  నివాసంలో  ,వారికి అల్పాహార విందు ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించారు..
ఎన్నాళ్లుగా చేస్తున్నారు మొక్కలు నాటడం పై మక్కువ ఎలా కలిగిందని  హరీష్ రావు వనజీవిని ప్రశ్నించగా  అందుకు సమాదానము ఇస్తూ... "తన ఐదవ ఏటా నుండే ఈ వనం అంటే మక్కువ. అప్పటి నుండే మొక్కలు నాటుతున్న. ఏ మనిషికి అయిన మనుగడ చెట్లే, ఒక చిన్న అగ్గిపుల్ల తో ఎంతో అగ్ని ని సృష్టించవచ్చు కానీ ఆ అగ్గి పుల్ల కూడా వచ్చేది మొక్క నుండే  అని బదులిచ్చారుు. మొక్క నుండి పూలు, పండ్లు, మంచి ఆక్సిజన్ , ఔషధాలు ఇలా ఎన్నో వస్తాయి. అని చెప్తూ వచ్చారు. మరి మీ బ్రతుకు దేరువు ఏంటి...!!  అని  హారిిిష్ యచ రావు వ్యవసాయంలో .   కొంత నష్టం జరిగింది. ఇప్పుడు కొడుకు చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు కోటి పైన మొక్కలు నాటిన.. మూడు కోట్ల మొక్కలు నాటలి అని సంకల్పం పెట్టుకున్న.. చెట్టు కన్నతల్లి లాంటింది. చేపను బయటకు తీయడానికి గాలం వేసినట్టు.. భూమిలోని పండ్లను బయటికి తీయడానికి మొక్క నాటాలి. 
ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ విధ్వంసం పరుగులు తీస్తోందని వనజీవి  పేర్కొన్నారు.      ఈ సమాజానికి గొప్ప ఆదర్శప్రాయులు. వనజీవి రామయ్య గారి జీవితం, ఆయన మొక్కలు పై మక్కువ, చెట్లు ఎలా పెంచుతున్నారు అనే విషయాల్ని ప్రజాప్రతినిధులు అందరూ వినాలి, తెలుసుకోవాలని ఈ సందర్భంగా వారికి హరీష్ వనజీవి పై తన అభిప్రాయం వ్యక్తం చేశారు...

No comments:

Post a Comment