Friday, 14 August 2020

యాభై వయస్సుపైబడిన వారికి ఎక్సరే , రక్త పరీక్షలు నిర్వహణ తప్పనిసరి...



తిరుపతి, ఆగష్టు 14: యాభై వయసు పై బడ్డ కోవిడ్ పాజిటివ్ వ్యక్తులకు తప్పనిసరి ఎక్సరే , రక్త పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త వైద్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం జెసి(డి) వీరబ్రహ్మం, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్ లతో కలిసి కేర్ సెంటర్ ఏర్పాటుకు గోవిందరాజ సత్రాలను,  శ్రీనివాసం వసతి సముదాయంలో  ఆకస్మిక పర్యటనలు నిర్వహించారు.
 జిల్లా కలెక్టర్ , జెసి (డి), కోవిడ్  కేర్ సెంటర్ ఏర్పాటుకు గోవిందరాజ సత్రాలను పరిశీలించారు. అనతరం శ్రీనివాసం లో ఆకష్మిక తనిఖీ నిర్వహించి  ఎక్స్ రే యూనిట్ పరిశీలించారు. రెండు మిషన్లు వున్నా పాత మిషన్ వాడక పోవడంపై జిల్లా కలెక్టర్  ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ గా అనుభవం వున్న కలెక్టర్  పాత మిషన్ పరిశీలించి అక్కడే ల్యాబ్ అసిస్టెంట్ తో మాట్లాడి వాడుకలో తెచ్చి స్వయంగా తన ఎక్స్ రే తీయమని కంప్యూటర్ అనుసంధానంతో పరిశీలించారు. చిన్న సమస్యలకు కూడా వైద్యపరికరాలు వాడక పోడం ఆగ్రహించారు.  రోజు 80 తీస్తుండటం కాదు కనీసం రెండు మిషన్లు ఉన్నందున 50 వయస్సు పై బడిన ప్రతి ఒక్కరికీ తీయాలని, రోజుకు 200 మందికి ఎక్సరే తీయాలని ఆదేశించారు. అందుకు అవసరమైన పరికరాలు, వస్తువులు సమకూర్చుకోవాలని,  అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్ పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం ఆక్సిజన్ బెడ్లు, అడ్మిషన్ కౌంటర్ పరిశీలించి ఆలస్యం లేకుండా అడ్మిషన్లు జరగాలని సూచించారు. హోం ఇసోలేషన్ కిట్లు, అడ్మిషన్ వద్ద ఇస్తున్న వెల్ కమ్  కిట్లు పరిశీలించారు.
 కలెక్టర్ పర్యటనలో డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు, డిటి శ్యామ్ మోహన్, వైద్య సిబ్బంది, సానిటేషన్ సిబ్బంది ఉన్నారు.

No comments:

Post a Comment