Sunday, 30 August 2020

తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు...

#వైభవంగా #శ్రీపద్మావతి #అమ్మవారి #ఆలయ

#పవిత్రోత్సవాలు #ప్రారంభం

#తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించారు. ఈ ఉత్సవాలు సెప్టెంబరు 2తో ముగుస్తాయి.

No comments:

Post a Comment