Thursday, 13 August 2020

గోదావరిలో గోషించిన వేదం... కరోనాతో పనుల్లేక గోదావరిలో దూకిన వేదపండితుడు....

పశ్చిమగోదావరి జిల్లా/ఏలూరు : కరోనా మహామ్మరి ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా కొందరి ఊపిరి తీస్తొంది. ఆచంట మండలం భిమలాపురనికి చెందిన #బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి  యర్ర గొండ్ల #పవన్ కుమార్ శర్మ (24)మృతదేహం పాలకొల్లు దగ్గర దిండి రెసార్టు వద్ద బయల్పడింది. వేదంలో ఎం.ఎ చదివిన పవన్ కుమార్ తీవ్ర కష్టలలో వున్న తన కుటుంబాన్ని పౌరోహిత్యం ద్వారా బతికిస్తున్నాడు...కరోనా   ఆర్ధిక ఇబ్బందులు తాళ లేక గోదావరి లో దూకి #ఆత్మహత్య చేసుకున్నాడు.ఇతని తండ్రి వృద్దాప్యాంలో వుండగా.. తల్లి మానసికంగా బాగోదని..నడువలేని బాబాయ్ ,90 ,వృధ్ధరాలు నాయనమ్మను తాన వృత్తి ద్వారా పోషించుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు తోటి స్నేహితులతో కలసి ఉత్సాహంగా.. ఉల్లాసంగా గడపాల్సిన వయస్సులో  పౌరోహిత్యం చేస్తూ కుటుంబ పోషణ బాధ్యత వహించినప్పటికి.   
.. కాగా కరోనా కారణంగా గత మార్చినుండి  ఆలయాలు మూతపడటంతో పాటు పెళ్లిల్లు.. పేరాంటలు వంటివి కూడా తగ్గిపోయాయి
 గత కొంత కాలంగా ఉపాధి లేకుండా పోవడంతో ఆర్థికంగా.మానసికంగా కృంగుబాటుకు గరైన పవన్ కుమార్ కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాక చించివాడ గోదావరి వంతెనపైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వేదమాత ఆశీస్సులేగాని ధనదేవత ఆదరణకు నోచుకోని పవన్ కుమార్ శర్మ కుటుంబాన్ని మనసున్న ధనరాజులు ఆదుకోవాలని... ఆతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం....

No comments:

Post a Comment