మహబూబ్ నగర్ జిల్లా :
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఉన్న పాతాళగంగ శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమగట్టు టీఎస్ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అందులో కొందరు బయట పడ్డారు.
భారీగా ఎగిసిపడుతున్న మంటలు,మంటల్లో చిక్కుకున్న 12 సిబ్బంది.
10 మందిని కాపాడిన సిబ్బంది.
ఘటనా స్థలానికి మంత్రులు జగదీష్ రెడ్డి,నిరంజన్ రెడ్డిలతో ట్రాన్సుకో సి.ఎం.డి.ప్రభాకర్ తదితరులు చేరుకున్నారు.
పవర్ హౌస్ టన్నేల్లో దట్టంగా అలుముకున్న పొగలు,మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది...
*మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్*......
శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ పవర్ హౌస్ లో ప్రమాదం దురదృష్టకరం
మొదటి యూనిట్లో ఫైర్ జరిగింది
నాలుగు ప్యానెల్స్ దెబ్బతిన్నాయి
పదిమంది బయటకు వచ్చారు.
లోపల తొమ్మిది మంది చిక్కు కున్నారు.
లోపల దట్టమైన పొగ ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
ఫైర్, పోలీస్ సిబ్బంది లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లారు
పొగ తో మూడు సార్లు
లోపలికి వెళ్లి వెనక్కు వచ్చారు.
ఆక్సిజన్ పెట్టుకుని వెళ్లినా
సంఘటనా స్థలానికి వెళ్ళ
లేకపోతున్నారు
ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది లోపలకు
వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
సింగరేణి సిబ్బంది సహాయం కోరాం
లోపల ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
జెన్ కో ఆసుపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు వారు సేఫ్ గానే ఉన్నారు.
No comments:
Post a Comment