Monday, 17 August 2020

వేద నిలయం వ్యవస్థాపకుడు దంటు నాగార్జున శర్మ మృతి.. శర్మగారి ఆధ్వర్యంలోనే అయోధ్యకు వెండి ఇటుక.


వేద నిలయం స్పిరిట్యుయల్‍ టూర్స్ అధినేత, ఫుడ్ బ్యాంక్ ఇండియా, ఇంప్రిట్స్ దంటు నాగార్జున శర్మ సోమవారం కరోనా తో కన్నుమూశారు.
వేలాది మంది భక్తులను తీర్థ యాత్రలకు  తీసుకెళుతూ  గత కొన్నేళ్లుగా అన్నదాతల సహకారంతో అనాధలకు..ఆపన్నులకు ఆహారం అందజేసిన నాగార్జున శర్మ.  ముషీరాబాద్‍ కేంద్రంగా తన కార్యాలయంలో కళాకారులకు, జర్నలిస్ట్ మిత్రులకు మధ్యాహ్న భోజనం తనే స్వయంగా వండి పెట్టే వారు.
నాగార్జున శర్మ కరోనా తో మృతి చెందడం
పట్ల  పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అఖిల భారత హిందూ మహాసభ  తెలంగాణ అధ్యక్షులుగా కూడా ఆయన గురుతర బాధ్యతలు నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆయన మృతిపట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆయోధ్య ఆలయ నిర్మాణంలో మోదీ శంకుస్థాపన చేసిన వెండి ఇటుకలు నాగార్జున శర్మగారి ఆధ్వర్యంలో తయారు చేయబడి శంకుస్థాపన లో వాడబడ్డాయి..శంకుస్థాపనకు ముందు హైదరాబాద్ నుండి  2 కిలోల బరువున్న ఓ వెండి ఇటుకను తీసుకువెళ్లి రామ మందిరంలో ఉపయోగించాలని అయోధ్య రామ మందిర కమిటీ అధ్యక్షునికి ఇవ్వగా ఆ ఇటుకను పరిశీలించిన కమిటీ.. 
ప్రధానమంత్రి మోదీ చేతులమీదుగా జరిగే శంకుస్థాపనకు మరో 4 వెండి ఇటుకలు కావాలని కోరడంతో    కమిటీ సూచన మేరకు భాగ్యనగరంలోని స్వర్ణకారులతో రూపుదిద్దుకున్న 5 ఇటుకలను మందిరం శంకుస్థాపనకు పంపాడం జరిగిందని నాగార్జున శర్మ  ఆనాడు స్వయంగా వెల్లడించారు.


No comments:

Post a Comment