Tuesday, 18 August 2020

దేశవిదేశాల్లో ఈ "బాలు"డి ఆరోగ్యం పై ఆరా.. గెట్ వెల్ సూన్ అంటూ ట్వీట్లు - పోష్టులు...

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం @ బాలు..
ప్రపంచం మెచ్ఛిన గాయకుడు. ఈ నెల 5న తనకు జలుబు,కొద్ది పాటి ఛాతి నొప్పిగా వుండటంతో డాక్టర్ వద్దకు వెళ్లానని అక్కడ డాక్టర్లు పరీక్షలో కరోనా పాజిటివ్ తెలడంతో సెల్పు క్యారంటైన్కు వెళ్లుతున్నట్ల స్వయంగా వీడియో విడుదల చేశారు..ఆనంతరం ఆయన చెన్నైలో ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్సపొందుతూ ఆందోళన కర పరిస్థితి నుండి కోలుకున్నారు.. తన తండ్రి కోలుకన్నాడని కుమారుడు వీడియో సందేశం ఇవ్వగా ఎస్.పి సోదరి శైలజ ఇప్పుడు పర్వాలేదు అన్నయ్య ఆరోగ్యం మెరుగైందంటూ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజా బాలుతో తన అనుబంధం వీడియోద్వారా వివరించారు.. "బాలు" శీఘ్రమా వా" వేగంగా కోలుకుని తిరిగి రావాలంటూ పేర్కొన్నారు...ఆర్.పి.పట్నాయక్ బాలు కోలుకోవాలంటూ వీడియో మధ్యామం ద్వారా పలువురు కళాకారులను కూడా గట్టి ప్రత్యేకంగా భక్తి గీతాలు ఆలపించారు. .విదేశాల్లో ప్రముఖులు బాలు గెట్ వెల్ సూన్ అంటున్నారు.
బాలు, 40 ఏళ్ళ మన స్నేహ బంధం ఇంకా ఇలాగే 60 ఏళ్ళు సాగాలి నువ్వు తొందరగా లేచి రావాలి.. నీ ప్రియ మిత్రుడు అశ్వినీదత్"
#"బాలు గారి గురించి ఎవరైనా పోస్ట్ పెడుతుంటేనే భయమేస్తోంది ఏంటో నాకు ... ఆయనకి ఏం కాదు, కాకూడదు.. కాదంతే .. నిజంగా అలా ఐన రోజు ఆయన లేని సంగీతం మాత్రం సంశయంలో పడదా.. అనాధగా జీవించగలదా ఆ సంగీతం.. మా బాలుకి నిండు నూరేళ్లు.. ఆయన గొంతుకి 1000 ఏళ్ళు"ఓ అభిమాని..సినీ నటి..ప్రార్థన"#
వివిధ దేశాల అభిమానులు సోషల్ మీడియా వేదికగా బాలు కొలువాలని పేర్కోంటూ ట్వీట్ లు..పోష్టులు పేడుతుండగా.... వివిధ బాషాల్లో మీడియా సైతం బాహుబాష గాయకుడు కోలుకోవాలని ప్రత్యేక శీర్షకలతో ప్రచురణలు వెలువరించింది .
బాలు ఆరోగ్యం కుదుటపడిందని  ఎస్‌.పి.చ‌ర‌ణ్ చెప్పగా మెగాస్టార్ చిరంజీవి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ట్విట్టర్ ద్వారా బాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా.. చిరు ఓ వీడియోను విడుదల చేశారు.."నేను కోలుకున్న ..బాలుగారు మీరు కోలుకోవాలి..గాయనీ సునీత విడియో సందేశం...
"AR Murugadoss has invited people on August 20th at 6 PM IST for a mass prayer for S. P. Balasubrahmanyam's speedy recovery"
బాలు అన్నయ్యా నీకా హక్కులేదు: సిరివెన్నెల..ట్వీట్...

1966లో సినీ గాయక ప్రస్థానం మొదలు పెట్టి..40వేల పైగా 11భాషాలలో పాటలు పాడి న బాలసుభ్రహ్మణ్యం .
శంకరా నాధ శారీర అని భక్తిని చాటినా...  పుణ్యభూమి నా దేశం అని గొంతేత్తిన..రవీవర్మకే అందని అందానివే అంటూ పాడిన..అణువు..అణువణువునా నిలిచిన దేవుని..స్మరించినా బాలు తనదైన
ముద్ర వేశారు.. 40 కి పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు.. పాటలకు సంబంధించిన ఎన్నో టివీ షోలకు తనదైన వ్యాఖ్యనాంతో రంజింప చెసే విధంగా బాలు మలిచారు.. దేశ..విదేశాల్లో శ్రోతలను కట్టిపడేసిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.. పలు కార్యక్రమాలలో. .ఎందరో మహానుభావులున్న సంగీత కళలో తానింకా బాలుడనే అంటూ వినమ్రంగా పేర్కొన్నారు.. ప్రస్తుతం చెన్నైలో హాస్పటల్లో బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా వుందని మిత్రులు చెబుతున్నారు... సో మనంకూడా Get Well Soon అందాం..

"

 

No comments:

Post a Comment